![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -603 లో.... నా చెల్లి మాట తీసుకుంది.. నా కూతురిని తన ఇంటికి కోడలిని చేసుకుంటానని దానికి తగ్గట్టుగానే నా కూతురు తన ఇంటికి కోడలు అయిందని దశరథ్ అంటాడు. నీ కూతురు ఆ ఇంటికి కోడలు ఎప్పుడు అయింది డాడీ అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ ఏంటి అత్త.. నీ కూతురు నా ఇంటికి కోడలు ఎలా అయిందని అడుగమని కాంచనతో జ్యోత్స్న అంటుంది.
ఊరు పేరు లేని ఒక అనాథ.. నీ ఇంటికి కోడలు ఎలా అయిందని జ్యోత్స్న అనగానే దీప అనాథ కాదని దశరథ్ గట్టిగా అరుస్తాడు. తనకి అమ్మ నాన్న ఉన్నారని దశరథ్ అంటాడు. అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోగలవా జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. చెప్పు బావ అని జ్యోత్స్న అంటుంది. దీపకి నాకు పెళ్లి జరిగినప్పుడు కాళ్ళు కడిగి ఎవరు కన్యాదానం చేశారు మావయ్య అత్తయ్యనే కదా.. మరి అలాంటప్పుడు దీప వాళ్ళ కూతురు అవుతుంది కదా.. నీ కూతురిని కోడలు చేసుకుంటానని మా అమ్మ మాట తీసుకుంది కానీ జ్యోత్స్ననే కోడలిని చేసుకుంటానని అనలేదు కదా అని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత కుబేర్ కి దీప ఎలా దొరికిందని అనసూయని దశరథ్ అడిగి తెలుసుకుంటాడు. దాంతో అనసూయ జరిగింది మొత్తం చెప్తుంది. దీపని మా తమ్ముడు ప్రాణంగా చూసుకున్నాడని అనసూయ చెప్తుంటే.. కుబేర్ ఫోటోకి దశరథ్ నమస్కారం చేస్తాడు. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని దశరథ్ ని కార్తీక్ బయటకు తీసుకొని వెళ్తాడు. నేను వెళ్తున్నానని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి మావయ్య సమయం వచ్చినప్పుడు చెప్దాం.. ముందు అత్తని కాపాడుకోవాలని కార్తీక్ తో చెప్తాడు దశరథ్. జ్యోత్స్న నా కూతురిని పట్టుకొని అనాధ అంటుంటే అనాధ కాదు నా కూతురని గట్టిగా అరవాలని అనిపించిందని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |